Appireddy: కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు..! 1 y ago
AP : రైతులు పడుతున్న కష్టం చూస్తుంటే బాధగా ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలన్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం సమాజంపై పడుతుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ముందు ఉందని తెలిపారు.
వ్యవసాయానికి జగన్ ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అండగా నిలిచారన్నారు. రైతులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. వ్యాపరస్తులకు ప్రయోజనం చేకూర్చడానికి ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు.
కూటమి నాయకులు రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ఆసియా ఖండంలోనే మిర్చికి సంబంధించి గుంటూరు జిల్లాలో సంవత్సరానికి రూ. 10 వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందని తెలిపారు. 150 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయని చెప్పారు. ఒకే చోట ఇన్ని కోల్డ్ స్టోరేజీలు ప్రపంచంలో కూడా లేవన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కూడా ఇక్కడకు సరుకు తీసుకొస్తారన్నారు. ఇన్ని అవకాశాలు ఉన్నా మిర్చి రైతులను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు.